‘వందేమాతరం’ ఆలాపన
నిర్మల్‌చైన్‌గేట్:జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు జిల్లా అంతా వందేమాతరం ఆలపించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాషన అభినవ్, అదనపు కలెక్టర్లు, కల్టెరేట్ అధి కారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో వందేమాతరం భారతీయులను ఐక్యం చేసిందన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రధాన కార్యాలయంలో..
నిర్మల్‌టౌన్: వందేమాతరం గీతం మన స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణ అని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సామూహిక వందేమాతరం ఆలాపాన నిర్వహించారు. పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకలు ప్రతీ భారతీ యునిలో దేశభక్తిని, ఐక్యతను, జాతీయ గౌరవాన్ని పెంచుతాయని తెలిపారు. వేడుకల్లో పోలీస్ అ ధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘వందేమాతరం’ ఆలాపన


