నిర్మల్ రూరల్: వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన డిబేట్‌లో జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన ఎం.విన్యత(10వ తరగతి), వి.శ్రీనిధి, ఆర్.రుథిత్న(9వ తరగతి) ప్రథమ స్థానం సాధించారు. ‘భారతదేశం ప్రపంచ సంతోష సూచికలో 118వ స్థానంలో ఉంది. మొత్తం దేశాలు 147 దీనిని ఎలా వృద్ధి చేయాలి’ అనే అంశంపై డిబేట్ నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.36 వేల బహుమతి లభిస్తుందని ప్రిన్సిపాల్ డేనియల్ తెలిపారు. గైడ్ టీచర్ కల్పన, విద్యార్థులను అభినందించారు.


