ఐక్యత కోసమే ఏక్తా రన్
నిర్మల్ టౌన్: దేశ సమైక్యత, సోదరభావానికి తనదైన మార్గాన్ని చూపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘ఏక్తా దివస్’ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 కిలోమీటర్ల ఏక్తా రన్ నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల ఈ రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. అందరూ ఐక్యత, పరస్పర గౌరవం కలిగి ఉండాలన్నారు. పటేల్ సేవలను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడిస్తే నిజమైన జాతీ య ఐక్యత సాధ్యమవుతుందని తెలిపారు. ‘ఏక్తా దివస్’ ద్వారా ప్రజల్లో ఐక్యతా భావం, సామరస్య ఉద్దేశం కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


