 
															సదర్‌మాట్‌ను సందర్శించిన అధికారులు
ఖానాపూర్: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని గోదావరికి వరద పోటెత్తింది. మండల అధికారులు నీటి ప్రవాహాన్ని శుక్రవారం సందర్శించారు. తహసీల్దార్ సుజాతతోపాటు ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో రత్నాకర్‌రావు మేడంపల్లి గ్రామంలోని సదర్మాట్ వద్ద 10.5 ఫీట్లు ఉన్న గోదావరి నీటి మట్టాన్ని పరిశీలించారు. అనంతరం బాదన్‌కుర్తి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సౌకర్యాలపై ఆరాతీశారు. అంతకముందు సుర్జాపూర్, మేడంపల్లి గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
