 
															నిర్మల్
న్యూస్‌రీల్
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
కుంటాల: ఇందిరమ్మ పథకంలో భాగంగా మండలంలోని విఠాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన గుండెటి శ్యామలకు ఇల్లు మంజూరు చేయగా, రెండు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసింది. గురువారం గృహ ప్రవేశం చేసింది ఇప్పటి వరకు ఆమెకు ప్రభుత్వం రూ.4 లక్షలు విడుదల చేసిందని, ఫైనల్ బిల్ మరో రూ.లక్ష రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సొంత ఇంట్లోకి రావడంతో సంతోషంగా ఉందని శ్యామల తెలిపింది. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో ఎంఏ.రహీంఖాన్, ఏపీవో గట్టుపల్లి నవీన్, పంచాయతీ కార్యదర్శి ఉత్తం, మాజీ సర్పంచ్ గల్లపురం లక్ష్మి పాల్గొన్నారు.
 
							నిర్మల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
