 
															కళాశాలల తనిఖీ
లక్ష్మణచాంద:మండల కేంద్రంలోని రెండు జూ నియర్ కళాశాలలను డీఐఈవో పరశురాం నా యక్ గురువారం తనిఖీ చేశారు. కేజీబీవీ జూ నియర్ కళాశాలను, అనంతరం సహకార జూ నియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో ప్రవేశాల వివరాలు ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. త్వరగా సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. డీఐఈవో వెంట కేజీబీవీ ఎస్‌వో నవిత, సహకార కళాశాల ప్రిన్సిపాల్ భోజన్న, జూనియర్ అసిస్టెంట్ భూమేష్ ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
