 
															సర్కారు బడుల్లో 5.0
లక్ష్మణచాంద/మామడ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు అందజేయడంతోపాటు, ఇప్పుడు విద్యాశాఖ ‘‘స్కూల్ 5.0 కార్యక్రమం’’ను ప్రారంభించింది.
ప్రధాన ఉద్దేశం..
ప్రతీ ప్రభుత్వ పాఠశాలను అందంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. విద్యార్థులకు ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం కల్పించడం ద్వారా విద్యా నాణ్యత పెంచడమే ప్రధాన ఆశయం అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం విజయానికి ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, దాతలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు అవుతారు. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
అమలు ఇలా..
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించనున్నారు. ఈ కాలంలో పాఠశాల భవనాల పరిశీలన నుంచి శానిటేషన్ వరకు పలు కార్యాచరణలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు విద్యా కేంద్రాలుగా మాత్రమే కాకుండా భద్రతా ప్రమాణాలకు ఆదర్శంగా నిలవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. పాఠశాల వాతావరణం మారితేనే విద్యార్థుల హాజరు, నేర్చుకునే ఆసక్తి, ఫలితాలు మెరుగుపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
అమలు చేయాల్సిన కార్యక్రమాలు..
పకడ్బందీగా అమలు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 5.0 కార్యక్రమంను పకడ్బందీగా అమలు చేస్తాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – భోజన్న, డీఈవో

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
