కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
భైంసాటౌన్: కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ సూ చించారు. సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభం నేపథ్యంలో పట్టణంలోని తన కార్యాలయంలో బు ధవారం మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డీఏవో అంజిప్రసాద్‌తో సమీక్షించారు. సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా కొనుగోళ్లు జరపాలని, వర్షాల నేపథ్యంలో కేంద్రాల్లో పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
సోయా కొనుగోళ్లు ప్రారంభం
పట్టణంలోని ఏఎంసీ యార్డు ఆవరణలో మార్క్‌ఫె డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాలను సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి విక్రయించి క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. పంట విక్రయించిన రైతుల ఖాతాల్లో వారం, పది రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్‌రావు పటేల్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డీఏవో అంజిప్రసాద్, పీఏసీఎస్, ఆత్మ చైర్మన్లు పాల్గొన్నారు.


