దళితుల భూములు అప్పగించాలి
సోన్: మండలంలోని పాక్‌పట్ల గ్రామంలో దళితుల భూమిని ఆక్రమించిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకుని సదరు స్థలాన్ని తిరిగి దళితులకు అప్పగించాలని కోరుతూ బుధవారం అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ మల్లేశ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంటోల్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. బోర ముత్యం, బోర చిన్న గంగన్న, బోర నడిపి నర్సయ్యకు చెంది న భూమిలో వీడీసీ సభ్యులు మట్టిరోడ్డు వేశారని తెలిపారు. స్పందించిన తహసీల్దార్ పట్టా భూమిపై పోసిన రోడ్డుపై విచారణ జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రవి, సుధీర్, రమేశ్, బోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


