
బాసరలో మహాబండారా
బాసర: బాసర రైతులు తమ గ్రామంలో కొలువైన శ్రీజ్ఞానసరస్వతీదేవి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు శుక్రవారం మహా బండారా(అన్నదానం) కార్యక్రమం నిర్వహించా రు. ముగ్గురు అమ్మలకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఆవరణలోనే అన్నప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామస్తులకు అన్నప్రసాదం అందించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, గ్రామం సుభిక్షంగా 105 ఏళ్లుగా ఈ మహా బండారా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉమ్మయి సంజీవరావు, ఓని నర్సింగరావు, బండారి ఆనంద్, నూకం రామారావు తదితరులు పాల్గొన్నారు.

బాసరలో మహాబండారా