ఆషాఢం.. సాంస్కృతిక వైభవం | - | Sakshi
Sakshi News home page

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

Jun 29 2025 2:28 AM | Updated on Jun 29 2025 2:28 AM

ఆషాఢం

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఏళ్లు గడుస్తున్నా.. ఏం మారలే
సారంగపూర్‌ మండలం బీరవెల్లి–నుంచి దిలావర్‌పూర్‌ మండలం లోలం రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

8లోu

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

9లోu

షాఢం.. తొలకరి వర్షాలతో ప్రకృతిని సౌందర్యవంతం చేస్తూ.. సంప్రదాయాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు ఆచారంగా మారింది. ఇక ఆషాఢం అనగానే గుర్తుకు వచ్చేది బోనాలు.. వర్షాకాలం ప్రారంభంలో గ్రామదేవతకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. కొత్తగా పెళ్లయిన ఆడబిడ్డలు పుట్టింటికి రావడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆషాఢ మాసం నేపథ్యంలో జిల్లాలో సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్సవాలపై ఆదివారం ప్రత్యేక కథనం.

– నిర్మల్‌ఖిల్లా/లక్ష్మణచాంద/కుంటాల

నిర్మల్‌లో కొలువుదీరిన అమ్మవారు

ఆషాఢం శూన్యమాసంగా పిలవబడినా పర్వదినా లు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, శాకంబరీ నవరాత్రులు, జగన్నాథ రథయాత్ర వంటి పర్వదినాలతో ఆధ్యాత్మికంగా ప్రకాశిస్తుంది. గురు పౌర్ణమి (జూలై 10)న వేదవ్యాసుని ఆరాధించి, గురువుల ఆశీస్సులు పొందుతారు. ఇక ఈ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. మహిళలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండలతో ఊరేగింపులు నిర్వహిస్తారు. పంటలు బాగా పండాలని, పిల్లాపాపలను చల్లగా చూడాలని, పాడి పశువులను కాపాడలని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు.

ఆచారాల శాసీ్త్రయత

ఆషాఢంలో కొత్తగా వివాహమైన యువతులను పుట్టింటికి పంపడం ఆచారం. ఈ మాసంలో గర్భం దాల్చితే, వేసవిలో ప్రసవం జరుగుతుంది, ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి హానికరం. ఈ ఆచారం శాసీ్త్రయ దృక్పథంతో రూపొందింది. అలాగే, వ్యవసాయ కుంటుంబాల్లో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లడం వల్ల కుటుంబం వ్యవసాయ పనులపై దృష్టి పెట్టగలుగుతుంది.

జిల్లాలో వేడుకలు..

జిల్లాలో ఆషాడమాస సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలం ప్రారంభం సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను బలి ఇచ్చి గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా పండగలు నిర్వహించుకుంటారు. ఇప్పటినుంచే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బంగల్‌ పేట్‌ మహాలక్ష్మి ఆలయం, సారంగాపూర్‌ మండలంలోని అడెల్లి పోచమ్మ, కుంటాల మండలంలోని గజ్జలమ్మ ఆలయాల్లో ఆషాఢమాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వనభోజనాలు..

ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. ముఖ్యంగా పల్లెల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటూ గ్రామ దేవతలకు, వన దేవతలకు పూజలు చేస్తారు. ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్యన వంటలు చేసుకుని అక్కడే సామూహికంగా వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తుంది.

పర్వదినాలు ప్రారంభం

గ్రామదేవతలకు బోనాలు

పుట్టింటికి నవ వధువులు..

మెహందీ వేడుకలు..

ఆరోగ్య, సౌందర్య రహస్యం

నిర్మల్‌లో శుక్రవారం బోనాల వేడుకల్లో పాల్గొన్న పట్టణవాసులు

వర్షాకాలంలో వాతావరణం చల్లబడినా, శరీరంలో వేడి అలాగే ఉంటుంది. గోరింటాకు ఈ వేడిని తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. లేత గోరింటాకు ఆకులను రుబ్బి అరచేతులకు, పాదాలకు రాస్తే ఎరుపు రంగు చర్మంలో ఇంకి సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. ఈ ఆచారం చర్మవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మకం. కొత్తగా వివాహమైన యువతులు ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుని శుభసూచకంగా భావిస్తారు.

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం 1
1/4

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం 2
2/4

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం 3
3/4

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం 4
4/4

ఆషాఢం.. సాంస్కృతిక వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement