
స్థానిక సమరానికి సై!
నిర్మల్
బోనాల పండుగకు వేళాయె
బోనాల సందడి మొదలు కానుంది. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుండగా డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరూవాడా మార్మోగనున్నాయి.
● సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలనిరాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం ● ముందుగా పంచాయతా.. పరిషతా? ● పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
జిల్లాకు సంబంధించిన వివరాలు
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025
8లోu
‘ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం’
నిర్మల్‌టౌన్: ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పేర్కొన్నారు. ఎమర్జెన్సీ రో జులకు నిరసనగా ‘సంవిధాన్ హత్య దివస్’ పే రిట బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి వీరు హాజరై మాట్లాడారు. ఎమర్జెన్సీ విధించిన జూ న్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్య దివస్’గా భా రత ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నా రు. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన వారందరికీ నివాళులర్పించారు. నాయకులు రావుల రాంనాథ్, అంజుకుమార్‌రెడ్డి, అయ్యన్నగారి భూ మయ్య, మెడిసేమ్మ రాజు, రాచకొండ సాగర్, రజిని, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని కలు పూర్తి చేయాలని హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో పల్లెల్లో అప్పుడే ఎ న్నికల కోలాహలం మొదలైంది. ఇన్నాళ్లుగా ఈ తీపికబురు కోసమే నిరీక్షించిన ఆశావహులు ఆనందపడుతున్నారు. కాగా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసి ఏడాది న్నరవుతోంది. గతేడాది జనవరిలో సర్పంచులు, జూలైలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కా లం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం కూడా పూర్తయింది. స్థా నిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి.
ఆశావహుల హడావుడి
ప్రస్తుతం వరుసగా అన్ని ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ టీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అ వకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగినట్లు ఆయా పార్టీలు నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులను చేస్తున్నాయి. పార్టీ ‘బీ’ ఫాంలతో నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల విషయంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డాయి.
సర్వం సన్నద్ధం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తిచేసింది. ఎలక్షన్ కమిషన్ ఎప్పు డు నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమైంది. గ్రామపంచా యతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలతోపా టు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ను అధి కారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కూడా సంసిద్ధులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీవో, ఏపీవోలకు శిక్షణ ఇచ్చా రు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లను ఆయా మండలాలకు ఇప్పటికే తరలించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
న్యూస్‌రీల్
మండలాలు : 18
గ్రామపంచాయతీలు : 400
వార్డులు : 3,368
ఓటర్లు : 4,40,997
మహిళా ఓటర్లు : 2,10,146
పురుష ఓటర్లు : 2,30,836
ఇతర ఓటర్లు : 15
ఎంపీటీసీ స్థానాలు : 157
జెడ్పీటీసీ స్థానాలు : 18
మండలాలవారీగా పంచాయతీలు, వార్డులు, ఓటర్లు
మండలం జీపీలు వార్డులు మహిళలు పురుషులు ఇతరులు
బాసర 10 90 7,427 7,956 01
భైంసా 30 258 15,970 17,269 02
దస్తూరాబాద్ 13 102 6,206 6,566 01
దిలావర్‌పూర్ 12 108 8,567 9,853 00
కడెం 29 242 13,739 14,761 01
ఖానాపూర్ 25 192 11,106 11,948 00
కుభీర్ 42 344 19,430 20,300 01
కుంటాల 15 134 9,112 9,726 00
లక్ష్మణచాంద 18 162 11,114 12,892 01
లోకేశ్వరం 25 224 13,492 15,465 03
మామడ 27 22 12,067 13,685 00
ముధోల్ 19 166 13,514 14,530 02
నర్సాపూర్ 13 120 9,298 10,413 01
నిర్మల్‌రూరల్ 20 170 10,515 12,085 00
పెంబి 24 152 5,265 5,581 00
సారంగపూర్ 32 282 17,917 20,582 02
సోన్ 14 132 10,067 11,498 00
తానూరు 32 268 15,340 15,726 00

స్థానిక సమరానికి సై!

స్థానిక సమరానికి సై!

స్థానిక సమరానికి సై!