అక్రమ పట్టా తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ పట్టా తొలగించాలి

Jun 10 2025 3:46 AM | Updated on Jun 10 2025 3:46 AM

అక్రమ

అక్రమ పట్టా తొలగించాలి

నాకు కుంటాల మండలంలో 1.2 ఎకరాల భూమి ఉంది. మా తమ్ముడు నాకు తెలియకుండా ఆ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నడు. ఇప్పుడు నాకు రైతుబంధు కూడా రావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్రమ పట్టా రద్దు చేయండి.

– జక్కుల గజ్జన్న, కుంటాల

సర్వే నంబర్‌ మిస్సింగ్‌

మేము ముగ్గురం అన్నదమ్ములము. మా అన్న పట్టా భూమి అయిన 314/1లో 19 గుంటలు, 408/అ/1 లో 6 గుంటలు ఉంది. ఆ భూమిని నేను 2018 లో కొనుగోలు చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సర్వే నంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఇప్పటికే 20 సార్లు అధికారులకు పిర్యాదు చేశాను. సమస్య పరిష్కరించండి

– కోరిపల్లి రవి, పోన్కల్‌

భూమి సర్కారుదంటున్నారు..

మాది కుంటాల మండలం అంబకంటి. 220, 324 సర్వే నంబర్లు మా అమ్మ కురుమే భూమి పేరుమీద 5.31 సాగుభూమి 1950 నుంచి 1970 వరకు ఉంది. తర్వాత కాలంలో ఈ భూమి సర్కారుది అంటున్నారు. పదేళ్లుగా తిరుగుతునా న్యాయం జరగడం లేదు. మా అమ్మ పేరు మీద ఉన్న భూమి వారసులమైన మా పేరిట రిజిస్టర్‌ అయ్యేలా చూడాలి. – గజ్వరి విట్టల్‌, అంబకంటి

అక్రమ పట్టా తొలగించాలి 
1
1/2

అక్రమ పట్టా తొలగించాలి

అక్రమ పట్టా తొలగించాలి 
2
2/2

అక్రమ పట్టా తొలగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement