హద్దులు చూపించాలి | - | Sakshi
Sakshi News home page

హద్దులు చూపించాలి

Jun 10 2025 3:46 AM | Updated on Jun 10 2025 3:46 AM

హద్దు

హద్దులు చూపించాలి

నాకు వారసత్వంగా సర్వే నంబర్‌ 167లో విస్తీర్ణం 5.14 ఎకరాల భూమి ఉంది. నా భూమి పక్కన గల 163 సర్వేనంబర్‌లో ఉన్న వారితో కొంత భూతగాదా జరిగింది 2023 డిసెంబర్‌లో, నా భూమి హద్దులు చూపించాలని నేను ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ పేరు మీద చలానా కట్టాను. అధికారులు వచ్చి భూమి కొలువగా 163 సర్వే నంబర్‌ నుంచి నాకు కొంత భూమి వస్తుందని తేలింది. నా ప్రత్యర్థి, నేను మరోసారి భూమి కొలవాలని ఏడీకి చలాన్‌ కట్టాం. నేటికీ సర్వే అధికారులు కచ్చితంగా మా భూమి ఇది అని హద్దులు చూపడం లేదు.

– పల్సీ దేవీదాస్‌, లింబాకే

డీసీవోపై చర్యలు తీసుకోవాలి

మహమ్మద్‌ నబీ అనే వ్యక్తి 16 సంవత్సరాల వయస్సు(మైనర్‌గా) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సత్తనపల్లిలో సెప్టెంబర్‌ 20, 1994లో సబ్‌ స్టాఫ్‌గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఇదే వ్యక్తి మహమ్మద్‌ నబీ, షేక్‌ నబీ పేర్లతో చలామణి అయి సొసైటీ నుంచి జీతం తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే పాత ఎల్లాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో 2006లో వార్డు మెంబర్‌గా పోటీ చేశాడు. 2012 వరకు వార్డు మెంబర్‌ విధులు నిర్వర్తిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కూడా జీతం తీసుకున్నాడు. ఇప్పుడు అతడిని డీసీవో రెగ్యులర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహమ్మద్‌ నబీపై చర్యలు తీసకుని అతను పొందిన జీతాన్ని రికవరీ చేయాలి.

– బలష్టు రాజన్న, గోడల పంపు

హద్దులు చూపించాలి 
1
1/1

హద్దులు చూపించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement