దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ | - | Sakshi
Sakshi News home page

దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ

May 23 2025 5:35 AM | Updated on May 23 2025 5:35 AM

దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ

దేశం గర్వించే సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ

నిర్మల్‌చైన్‌గేట్‌: దేశం గర్వించదగ్గ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ అని అదనపు కలెక్టర్‌ ఫైజా న్‌అహ్మద్‌ అన్నారు. భాగ్యరెడ్డివర్మ 137వ జ యంతి వేడుకలను కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌ జ్యోతిప్రజ్వలన, చిత్రపటానికి పూలమాల చేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కి, ముఖ్యంగా దళిత మహిళల విద్యాభివద్ధికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషి అపూర్వమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, శంకర్‌, మోహన్‌సింగ్‌, నరసింహారెడ్డి, దళిత సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో..

నిర్మల్‌టౌన్‌: భాగ్యరెడ్డివర్మ జీవితం నేటి తరానికి ఆదర్శమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో భాగ్యరెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనిస్‌ అలీ, ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, సమ్మయ్య, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌, రమేశ్‌, ఆర్‌ఎస్‌ఐలు రవికుమార్‌, రాజశేఖర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement