
బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి
ఖానాపూర్: బుద్ధుడి శిష్యుడు విడిది చేసిన ఖానాపూర్ మండలం బాదనకుర్తిని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని పలువురు వక్తలు కోరారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా బాదనకుర్తిలోని బుద్ధుని విగ్రహం వద్ద సోమవారం వేడుకలు నిర్వహించారు. బుద్ధుని శిష్యుడు బాదనకుర్తి గ్రామంలో విడిది చేస్తూ తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు బౌద్ధం విస్తరింపజేశారని తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని బౌద్ధ క్షేత్రంగా మారుస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సత్యపరిశోదక్ సమాజ్, బామ్ సేఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ రక్షక, మాజీ సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, బుద్దిస్ట్ ఇంటర్‌నేషనల్ నెట్‌వర్క్ జిల్లా అధ్యక్షుడు మాదారపు రాములు, నాయకులు రా ము, గంగన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.