కళాశాలలుగా కేజీబీవీలు | - | Sakshi
Sakshi News home page

కళాశాలలుగా కేజీబీవీలు

May 12 2025 12:12 AM | Updated on May 12 2025 12:12 AM

కళాశా

కళాశాలలుగా కేజీబీవీలు

● జిల్లాలో 18 కస్తూర్బా పాఠశాలలు ● ఇప్పటికే 12 చోట్ల ఇంటర్‌ బోధన ● తాజాగా మరో నాలుగింటిలోనూ.. ● అందుబాటులోకి మరో 240 సీట్లు ● హర్షం వ్యక్తంజేస్తున్న విద్యార్థినులు

లక్ష్మణచాంద: పేద, మధ్యతరగతికి బాలికల చదు వు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పా టు చేసింది. కార్పొరేట్‌కు దీటుగా బాలికలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తోంది. కేజీబీవీలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం కొన్ని పా ఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చే స్తూ వస్తోంది. బాలికలకు ఇంటర్‌ విద్యను కూడా కస్తూరిబా విద్యాలయాల్లో బోధిస్తోంది. ఈసారి కూడా జిల్లాలోని నాలుగు కేజీబీవీలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది.

అందుబాటులోకి మరో 240 సీట్లు

జిల్లాలో 18 కేజీబీవీలున్నాయి. ఇందులో ప్రతీ సంవత్సరం కొన్ని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అవుతూ వచ్చాయి. ఇప్పటికే జిల్లాలోని 14 విద్యాలయాలు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. 2025–26 విద్యాసంవత్సరం కూడా నాలుగు కేజీబీవీలు జూనియర్‌ కళాశాలలుగా అప్‌గేడ్ర్‌ అయినట్లు జిల్లా సెక్టోరియ ల్‌ అధికారి సలోమి కరుణ తెలిపారు. ఇందులో సో న్‌, నిర్మల్‌ రూరల్‌, కుభీర్‌, లోకేశ్వరం కేజీబీవీలు న్నాయి. సోన్‌ కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు, నిర్మల్‌ రూరల్‌ కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు, కుభీర్‌, లోకేశ్వరం కేజీబీవీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. నాలుగు కేజీబీవీలు జూనియర్‌ కళా శాలలుగా అప్‌గ్రేడ్‌ కావడంతో జిల్లాలో మరో 240 ఇంటర్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. సోన్‌ కేజీబీవీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం సీఈసీ లో 40సీట్లు, ఎంపీహెచ్‌డబ్ల్యూలో 40, నిర్మల్‌ రూరల్‌ కేజీబీవీలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కుభీర్‌, లోకేశ్వరం కేజీబీవీల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో 40 సీట్ల చొప్పున అందుబాటులోకి వస్తున్నాయి.

సంతోషంగా ఉంది

న్యూవెల్మల్‌ కేజీబీవీ జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ కావడం సంతోషంగా ఉంది. కేజీబీవీలో పదో తరగతి పూర్తి చేసిన నేను తిరిగి ఇదే విద్యాలయంలో ఇంటర్‌ చదివేందుకు దరఖాస్తు చేసుకుంటాను. మాలాంటి పేద విద్యార్థినులకు ఇది ఒక మంచి అవకాశం.

– వెన్నెల, విద్యార్థి, న్యూవెల్మల్‌

జిల్లా సమాచారం

జిల్లాలోని కేజీబీవీలు: 18

ఇప్పటికే అప్‌గ్రేడ్‌ అయినవి: 12

తాజాగా అప్‌గ్రేడ్‌ అయినవి: 4

అందుబాటులోకి రానున్న సీట్లు : 240

కళాశాలలుగా కేజీబీవీలు1
1/1

కళాశాలలుగా కేజీబీవీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement