
పేపర్ మిల్లును సందర్శించిన రైతులు
దస్తురాబాద్: మండల కేంద్రానికి చెందిన రైతులు శనివారం సిర్పూర్ పేపర్ మిల్లును సందర్శించారు. పేపర్ తయారు విధానాన్ని, పేపర్ తయారీకి వినియోగించే నీలగిరి, సరుగుడు మొక్కల నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నర్సరీ నిర్వాహకులు మాట్లాడారు. పేపర్‌కు అవసరమైన నీలగిరి, సరుగుడు మొక్కలు రైతులకు అందిస్తామని తెలిపారు. నీలగిరిలో 25 రకాల మొక్కల పెంపకం చేసి రైతుల భూమిని పరిశీలించి మొక్కలు అందిస్తామని పేర్కొన్నారు. మూడేళ్లకు పంట చేతికి వస్తుందని తెలిపారు.
రాజీవ్ యువవికాస్
దరఖాస్తులు అందించాలి
నిర్మల్‌టౌన్: రాజీవ్ యువ వికాస్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11 సాయంత్రం 5:30 గంటల వరకు వాటిని మున్సిపల్ కార్యాలయం కౌంటర్‌లో అందజేయాలని కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫారంతోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు జిరాక్స్ సమర్పించాలని సూచించారు.