ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు.. | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..

May 11 2025 12:12 AM | Updated on May 11 2025 12:12 AM

ముగ్గ

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..

సారంగపూర్‌ మండలం తాండ్రకు చెందిన సుగంధి, సుశీల, చంద్రకళ, రాజమణి అక్కాచెల్లెళ్లు. ఇందులో సుశీల చిన్నకుమారుడు సంతోష్‌, చంద్రకళ పెద్ద కొడుకు ప్రవీణ్‌, రాజమణి పెద్దకుమారుడు శ్రీకాంత్‌ సైన్యంలో ఉన్నారు. ఈ గ్రామం నుంచి పలువురు సైన్యంలో పనిచేస్తున్నా.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల కుమారులు ముగ్గురూ దేశరక్షణలో ఉండటం విశేషం. కశ్మీర్‌ వంటి సమస్యాత్మక ప్రాంతంలోనే విధులు నిర్వర్తించడం గమనార్హం. తమ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు సైన్యంలో చేరారని, వారు దేశం కోసం పనిచేయడం తమకు గర్వంగా ఉందని ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ సిందూర్‌, యుద్ధవాతావరణ నేపథ్యంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు తమ బిడ్డలతో మాట్లాడుతున్నామంటున్నారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..1
1/2

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..2
2/2

ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొడుకులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement