
ఉద్యోగ వ్యతిరేక వైఖరి వీడాలి
నిర్మల్‌చైన్‌గేట్: సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగ వ్యతిరేక వైఖరి వీడాలని భారతీయ పెన్షనర్ల ఫెడరేషన్ జా తీయ కార్యదర్శి ఎంసీ లింగన్న కోరారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు, పెన్షనర్లపై వ్య తిరేక ధోరణితో సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇంటిముఖం పట్టాయని గుర్తు చేశారు. సంఘాలతో సత్వరమే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకుంటే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ హన్మంత్‌రెడ్డి, యూనిట్ అధ్యక్షుడు పీ విలాస్, జిల్లా ఆర్థిక కార్యదర్శి లోలం గంగన్న, యూనిట్ కార్యదరి జనార్దన్, విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యవర్గం, యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.