
నిర్మల్
ట్రిపుల్‌ఐటీ విస్తరణ
బాసర ట్రిపుల్‌ఐటీకి అనుబంధంగా మరో రెండు క్యాంపస్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎల్కతుర్తి, మహబూబ్‌నగర్‌లో భూములు పరిశీలించారు.
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
జిల్లాలో ఆకట్టుకునే పర్యాటక అందాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. దశాబ్దాలుగా పాలకులు, అధికారుల నుంచి సరైన పట్టింపు లేకపోవడంతో క్రమంగా కనుమరుగవుతున్నాయి. గత పాలకులు నిర్మల్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. పదేళ్లలో ఆ దిశగా అడుగు కూడా ముందుకు పడలేదు. జిల్లాకు వచ్చిన పలువురు కలెక్టర్లూ.. తమవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. ఎన్ని ప్రతిపాదనలు పంపినా పైసా ఇవ్వలేదు. సదరు అధికారులు బదిలీ కావడంతోనే ఆ ఫైళ్లు కూడా అటకెక్కుతున్నాయి. దీంతో జిల్లాలో పర్యాటక అభివృద్ధి ప్రశ్నార్థకంగానే మిగిలింది. గత నెల 20న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్‌రెడ్డి సైతం జిల్లా కేంద్రంలో పర్యటించి వెళ్లారు. పలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఈసారైనా పర్యాటకాభివృద్ధికి అడుగు ముందుకు పడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
– నిర్మల్
జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
● పలు ప్రాంతాల్లో సెకన్లపాటు కంపించిన భూమి
నిర్మల్‌ఖిల్లా/లక్ష్మణచాంద/దస్తురాబాద్/ఖానాపూర్: నిర్మల్ జిల్లాలోని పలుప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, పెంబి, లక్ష్మణచాంద, దస్తురాబాద్, కడెం, తదితర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. కడెం మండల కేంద్రంలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీకెమెరాల్లో భూమి కంపించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఖానాపూర్‌లో వ్యాపార సముదాయల్లోంచి యజమానులు, వ్యాపారులు భయంతో బయటకు వచ్చారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో సైతం స్వల్ప భూకంపం వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వ్యాప్తి చెందడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
శివాజీ విగ్రహం, పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదించిన బంగల్‌చెరువు
ఎన్నో ఉన్నా..
నిర్మల్‌లోనే బత్తీస్‌గఢ్, ఖిల్లాగుట్ట, సోన్‌గఢ్, వేంకటేశ్వరగఢ్, గజ్‌గఢ్, దసరా బురుజు, తదితర ప్రాంతాలన్నింటా పర్యాటకాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం మధ్యలోనూ ఖిల్లా, ఇటుకలతో నిర్మించిన నాటి ఆయుధ కర్మాగారాలు, ఎప్పుడూ చల్లగా ఉండే సరద్‌మహల్.. ఇలా పాడుబడి పోతున్నవెన్నో ఉన్నాయి. వాటిని కాసింత బాగు చేయించినా చరిత్రతో పాటు పర్యాటకంగానూ ఆకట్టుకుంటాయి. చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎప్పుడూ జలకళతో ఉంటాయి. కనీసం వాటిల్లో బోటింగ్ పెట్టినా పిల్లాపాపలతో కుటుంబాలు ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉంటుంది.
బంగల్ చెరువులో శివాజీ విగ్రహం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్‌రెడ్డి గ తనెల 20న జిల్లా కేంద్రానికి వచ్చారు. జిల్లా గ్రంథా లయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ కోరిక మేరకు వ చ్చిన ఆయన నిర్మల్, పాక్‌పట్లలో పర్యటించారు. జి ల్లాకేంద్రంలోని బంగల్‌చెరువు, బత్తీస్‌గఢ్, శ్యాంగఢ్‌లతో పాటు పాక్‌పట్లలోని మొసళ్ల మడుగును చూ పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గణేశ్‌చక్రవర్తి, అర్జుమంద్‌అలీ తదితరులు ఆయనకు ఆయా ప్రాంతాల విశేషాలను వివరించారు. ఈమేరకు పలు ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
● బంగల్‌చెరువు మధ్యలో ఒకప్పుడు నాట్యశాలగా ఉన్న గద్దైపె ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలి.
● బంగల్‌పేట్ నుంచి విశ్వనాథ్‌పేట వైపు వెళ్లే బంగల్‌చెరువు కట్ట రోడ్డును వెడల్పు చేయాలి.
● చెరువులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు కట్టలపై హుస్సేన్‌సాగర్ తరహాలో బెంచీలు, రెయిలింగ్, లైటింగ్ పెట్టాలి.
● శ్యాంగఢ్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేలా మరమ్మతులు చేసి, లైటింగ్, పిల్లల పార్కులను ఏర్పాటు చేయాలి.
● బత్తీస్‌గఢ్‌తో పాటు పాక్‌పట్ల మొసళ్ల పార్కులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
ఆయా ప్రతిపాదనలపై టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్‌రెడ్డి సుముఖత వ్యక్తంచేశారు.
శ్యాంగఢ్‌ను పరిశీలిస్తున్న రమేశ్‌రెడ్డి
● ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్
న్యూస్‌రీల్
లారీల అడ్డాగా శ్యాంగఢ్..
నిమ్మనాయుడు, వెంకట్రాయుడు, శ్రీనివాసరావు తదితర పాలకుల పాలనలో నిర్మల్‌లో ఎన్నో చారిత్రక గఢ్‌లు నిర్మీతమయ్యాయి. ఇందులో నిర్మల్‌లోకి ప్రవేశించే మార్గంలో ఉన్న శ్యాంగఢ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది గోల్కొండ కోట తరహాలో ఆకట్టుకుంటోంది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ గఢ్‌ను బల్దియా నిధులతోనే అభివృద్ధి చేయాలని గత కలెక్టర్లు ఆదేశించారు. పిల్లలు ఆడుకునేలా పార్క్, పచ్చని చెట్లు, కూర్చుని సేద దీరేందుకు బెంచీలు, ఫౌంటెన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఇక శ్యాంగఢ్ మరో గోల్కొండ అవుతుందని అంతా భావించారు. కానీ కేవలం రాత్రిపూట లైటింగ్‌కే పరిమితమైంది. అభివృద్ధి మాట దేవుడెరుగు శ్యాంగఢ్ ముందుభాగాన్ని లారీల అడ్డాగా మార్చేశారు. మరోవైపు గఢ్ చుట్టూ భూములను చదును చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు.
ప్రతిపాదనలు, అంచనాలతో కలుస్తాం..
జిల్లా కేంద్రంతో పాటు పాక్‌పట్లలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్‌రెడ్డి పర్యటించారు. అప్పుడు తాము చేసిన ప్రతిపాదనలపై పూర్తి వ్యయ అంచనాలతో త్వరలోనే హైదరాబాద్ వెళ్లి ఆయనను కలుస్తాం. సంబంధిత పనులను త్వరలోనే చేపట్టాలని కోరుతాం. – అర్జుమంద్‌అలీ,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్