నిర్మల్‌ | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Thu, Apr 11 2024 8:05 AM

- - Sakshi

మూగజీవాలు విలవిల

ఇప్పచెట్లపై గొడ్డలి వేటు

సారంగపూర్‌ మండలంలోని అటవీ ప్రాంతాల్లో అక్రమార్కులు ఇప్పచెట్లను నరికి ఇష్టారాజ్యంగా లారీల్లో తరలిస్తున్నారు.

9లోu

8లోu

గురువారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

శిక్షణకు గైర్హాజరైన

43 మందికి నోటీసులు

ఖానాపూర్‌: ఈ నెల 1న ఖానాపూర్‌లోని ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో ‘హౌజ్‌ ఆఫ్‌ పీపు ల్స్‌’ (హెచ్‌వోపీ) పేరిట ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గస్థాయిలో పీవో, ఏపీవోల కు ఒకరోజు, ఓపీవోలకు ఒకరోజు శిక్షణ ఇచ్చా రు. కార్యక్రమానికి గైర్హాజరైన ఖానాపూర్‌, క డెం, పెంబి, దస్తురాబాద్‌ మండలాలకు చెంది న 43 మంది అధికారులకు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్‌ బుధవారం నోటీసులు జారీ చేశా రు. ఇందులో ఖానాపూర్‌ మండలానికి చెందిన 29 మంది, కడెం మండలానికి చెందిన 9 మంది, పెంబి మండలానికి చెందిన ముగ్గురు, ద స్తురాబాద్‌ మండలానికి చెందిన ఇద్దరు అధికా రులు ఉన్నారు. గైర్హాజరైనవారు అందుకు కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గైర్హాజరైన వారు కలెక్టర్‌ తీసుకునే చర్యలకు సంబంధిత శాఖలు ఎలాంటి బాధ్యత తీ సుకోవని ముందే హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు గైర్హాజర్‌ కావడం గమనార్హం.

నిర్మల్‌: జిల్లాల్లో రోజురోజుకూ శృతిమించుతున్న ఆర్‌ఎంపీల తీరుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల సీరియస్‌గా స్పందించింది. గ్రామాల్లో తామే ‘డాక్టర్‌’లుగా చలామణి అవుతున్న తీరుపైనా హెచ్చరించింది. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌)యాక్ట్‌–2010 ప్రకా రం ప్రథమ చికిత్స చేసే ఆర్‌ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్‌ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ప్రజల ప్రాణాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జిల్లాలోనూ చాలామంది ఆర్‌ఎంపీల వ్యవహారం వివాదాస్పదంగానే సాగుతోంది.

జిల్లాలోనూ ఆర్‌ఎంపీల హవా..

నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో పెద్దపెద్ద ఆస్పత్రులు కట్టుకున్న కొంతమంది వైద్యుల కంటే కొన్ని మండలాల్లో ఆర్‌ఎంపీలు హవా నడిపిస్తున్నా రు. కొన్నిచోట్ల రోజుకు పదులసంఖ్యలో ఓపీ ఉంటోంది. చాలామంది ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్సతోనే ఆగడం లేదు. ఏకంగా స్టెతస్కోప్‌ పట్టుకుని పరిశీలిస్తూ.. తమకు తోచిన ప్రిస్కిప్షన్‌ రాసేస్తున్నా రు. ఏ సమస్యతోనైనా తన వద్దకు పేషెంటు రాగా నే ముందుగా సైలెన్‌ బాటిల్‌ ఎక్కించేస్తున్నారు. ‘జ ల్దీ.. జరం తక్కయిపోవాలె సారూ..’ అని ఎవరన్నా అన్నారంటే.. తమకు తెలిసిన పెద్దపెద్ద గోలీలు రాసేస్తున్నారు. మరికొంతమంది మరోఅడుగు ముందుకేసి చిన్నపాటి ఆపరేషన్లనూ చేసేస్తున్నారు.

పిల్లలు పుట్టేందుకూ..

జిల్లాలో కొంతమంది ఆర్‌ఎంపీల తీరు మరింత వివాదాస్పదంగా ఉంది. ఏళ్లుగా పిల్లలు పుట్టని వారికి మందులు ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ దాకా పోయొచ్చినా.. ఎన్ని దవాఖానాలు తిరిగినా సంతానం కానివాళ్లల్లో చాలామందికి తమవద్దకు రాగానే సంతానమైందని, తాము చెప్పినట్లు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే చాలని చెబుతున్నారు. మండలాల్లోనే కాదు.. సాక్షాత్తూ జిల్లాకేంద్రంలోనే ఇలాంటి ఆర్‌ఎంపీలు ఉండటం గమనార్హం. ఎన్నేళ్లు వాళ్ల వద్దకు తిరిగినా.. సంతానం కాకపోతే.. ఇక మీలోనే ఏదో లోపముందంటూ పంపించేస్తున్నారు. ఇలాంటి బాధితుల దగ్గర ఫీజులనూ భారీగానే వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది కాన్పులు, అబార్షన్లు సైతం చేస్తున్నారు. సారంగపూర్‌ మండలంలో నాలుగేళ్ల క్రితం ఓ వివాహితకు అబార్షన్‌కు ఆర్‌ఎంపీ యత్నించగా పరిస్థితి విషమించింది. ఆమెను నిజామాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది.

సిఫార్సులతో సంపాదన..

జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్‌లోనూ చాలా ప్రైవేటు ఆస్పత్రులు కేవలం ఆర్‌ఎంపీలు చేసే సిఫార్సులతోనే నడుస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఆర్‌ఎంపీలకు భారీగా కమీషన్లు ఇవ్వడంతో పాటు దావత్‌లు, గిఫ్టులనూ ఇస్తున్నాయి. ఆర్‌ఎంపీల ఇళ్లల్లో ఫంక్షన్లు ఉంటే ఖరీదైన కానుకలను ఇస్తున్నారు. తమవద్దకు ఏ పేషెంట్‌ వచ్చినా తమకు ఎక్కువ కమీషన్లు ఇచ్చే ఆస్పత్రికే ఆర్‌ఎంపీలు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ తన వద్దకు వచ్చివెళ్లిన పేషెంట్‌ తనకుతాను ఏదైనా ఆస్పత్రికి వెళ్లినా.. ఆర్‌ఎంపీలు సదరు ఆస్పత్రుల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. పేషెంటు పరిస్థితి, వైద్యచికిత్సలు, ఆపరేషన్లు.. ఇలా ఆస్పత్రులు ఇచ్చే ట్రీట్‌మెంట్‌, వేసే బిల్లులను బట్టి వీరికి కమీషన్లు దక్కుతున్నాయి. కొన్ని ఆస్పత్రులు ఆర్‌ఎంపీలను తరచూ కలవడానికే పీఆర్‌వోలను పెట్టుకోవడం గమనార్హం.

న్యూస్‌రీల్‌

అర్హత లేకుండా వైద్యంపై సీరియస్‌

‘ప్రథమ చికిత్స’కు మాత్రమే అనుమతి

పేరుకు ముందు డాక్టర్‌ అని పెట్టొద్దు

సీరియస్‌గా ఆదేశించిన వైద్యారోగ్యశాఖ

ఆస్పత్రులకు సిఫార్సులపైనా సీరియస్‌

వైద్య,ఆరోగ్యశాఖ సూచించిన నిబంధనలు..

ఆర్‌ఎంపీలు తమ పేరుకు ముందు డాక్టర్‌ అని పెట్టుకోకూడదు.

తమ చికిత్స కేంద్రానికి ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌ (ప్రథమచికిత్స కేంద్రం) అని మాత్రమే ఉండాలి.

ఆర్‌ఎంపీలే స్వయంగా రోగనిర్ధారణ చేసి మందులు, ఇంజెక్షన్లు ఇవ్వొద్దు.

రోగులకు మందులు(ప్రిస్కిప్షన్‌) రాసివ్వడం, సైలెన్‌ బాటిళ్లు ఎక్కించడం చేయొద్దు.

ఇన్‌పేషెంట్లను ఉంచడం, ల్యాబ్‌లను నిర్వహించడం చేయకూడదు.

అబార్షన్లు, కాన్పులు, హైరిస్కు చికిత్సలను చేయవద్దు.

రోగులను ప్రలోభపెట్టడం, వైద్యం కోసం ఆస్పత్రులకు సిఫార్సు చేయడం, బలవంతంగా పంపడం చేయరాదు.

అధికారుల తీరూ అనుమానాస్పదమే..

ఓవైపు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి పక్కాగా వ్యవహరిస్తుండగా జిల్లాలో మాత్రం ఆశాఖ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. తమ కళ్లెదుటే ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా.. అదేం లేదన్నట్లుగా వాదిస్తోంది. సంబంధిత అధికారులు ఏదైన ఘటన జరిగినప్పుడే తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఆరోపణలు, ఫిర్యాదులనూ ‘మాములు’గానే తీసుకుంటున్నట్లు శాఖాధికారులపైనే ఆరోపణలు ఉన్నాయి.

ఆస్పత్రుల లెక్కనే..

గ్రామాల్లో అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స అందించడమే ఆర్‌ఎంపీలు చేయాల్సిన పని. ఇందుకు తాము ఉంటున్న గదికి క్లినిక్‌ అని, ఆస్పత్రి అని, నర్సింగ్‌హోం, మెడికల్‌హాల్‌ అని కూడా పెట్టుకోవడానికి లేదు. కేవలం ‘ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌’(ప్రథమ చికి త్స కేంద్రం) అని మాత్రమే రాసుకోవాలి. అందులో ఇన్‌పేషెంట్లు ఉండటానికి వీలు లే దు. కానీ.. జిల్లాలోని చాలా మండలాల్లో ఏ కంగా ఓ చిన్నపాటి ఆస్పత్రుల తరహాలోనే ఆర్‌ఎంపీలు మెయింటేన్‌ చేస్తున్నారు. నా లుగైదు బెడ్లు, అందులోనే మెడికల్‌హాల్‌ పె ట్టేస్తున్నారు. ఏకంగా ‘హాస్పిటల్‌’.. అంటూ బోర్డుపై రాసేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement