
ఆదివాసీ మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్
కడెం: ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ దత్తత గ్రామమైన మండలంలోని కడెం–పెద్దూర్ జీపీ పరిధిలోని కొలాంగూడను సందర్శించారు. ప్రధాన రహదారి నుంచి కాలినడకన గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆదివాసీలు సంపద్రాయ నృత్యాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఇంటి ఆవరణలో కూరగాయలు పండించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రా మంలోని మహిళలు ఉపాధి పొందేందుకు పల్లిపట్టి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కు ఐటీడీఏ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనం ఆవరణలో అదనపు గదులు నిర్మించి, అందులో పల్లిపట్టీ తయారీ యూనిట్‌ను నెలకొ ల్పనున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ కింద అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ. 50వేల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అ నంతరం గ్రామంలో తాగు, సాగునీటి ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామంలో చేతిపంపులు ఏర్పాటు చేయడానికి గ్రౌండ్‌వాటర్‌ను పరిశీలించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. సాగునీటి కోసం ఫౌంపౌండ్స్ ఏర్పాటు చేయించాలని ఉపాధిహామీ సి బ్బందికి సూచించారు. సీ్త్రనిధి నుంచి గొర్రెల పెంపకానికి రూ.73 వేల రుణం ఇస్తున్నట్లు తెలిపారు. దీ నిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండ ల కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేయాలని ఇన్‌చార్జి తహసీల్దార్ చిన్నయ్యను ఆదేశించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, సీసీ గంగాప్రసాద్, ఎంపీపీ అలెగ్జాండర్, ఎంపీవో వెంకటేశ్, ఏపీవో జయదేవ్, ఏపీఏం రాజారాం, ఈజీ ఎస్, ఐకేపీ, వైద్య సిబ్బంది తదితరులున్నారు.