
శోభాయాత్ర స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ
నిర్మల్‌టౌన్: పండుగలను శాంతియుతంగా జ రుపుకోవాలని ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే శ్రీ రామనవమి శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను బు ధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీరామనవమి, రంజాన్ పండుగలను ఇరువర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరూ సో షల్ మీడియాలో వస్తున్న పుకార్లు, వివిధ పో స్టులను నమ్మి ఆవేశాలకు లోనుకాకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దన్నా రు. శోభాయాత్ర మార్గంలో గుంతలు పూడ్చి వేయించి రహదారిపై ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ మల్లేశ్ తదితరులున్నారు.