నిర్మల్‌చైన్‌గేట్: ఆధార్ నవీకరణ వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించా రు. బుధవారం ఆయన ఛాంబర్‌లో ఆధార్ అప్‌డేట్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2010–2016 మధ్య ఆధార్‌కార్డు పొందినవారు ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ సేవలను సులభంగా పొందేందుకు పేరు, చిరునామాకు సంబంధించిన రుజువు పత్రాలతో దగ్గరలోని ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 10 శాతం నవీకరణ జరిగిందని, ఆగస్టు 31వరకు మిగతా 90 శాతం నవీకరణ జరగాలని, ఇందుకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.