
బస్సు పాసులు అందిస్తున్న అధికారులు
భైంసారూరల్: ప్రయాణికుల చెంతకే ఆర్టీసీ సేవలు ఉంటాయని ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ జానీరెడ్డి అన్నారు. భైంసా మండల పరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన రాయితీ బస్సుపాస్ మేళాకు హాజరై మాట్లాడారు. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇలాంటి పథకాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. 30 మంది దివ్యాంగులకు 50 శాతం రాయితీపై పాసులు అందించారు. కార్యక్రమంలో భైంసా ఆర్టీసీ డీఎం అమృత, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, నాయకులు గణేశ్ పాల్గొన్నారు.