
సమావేశానికి హాజరైన అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అధికారులు, సిబ్బంది
● కలెక్టర్ వరుణ్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్:జిల్లాలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పోషణ్ పక్వాడ్ పక్షోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌కే.రసూల్‌బీతో కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. చిరుధాన్యాలతో లాభాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలు పూర్తిస్థాయిలో అంగన్‌వాడీ టీచర్లకు వివరించాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి పిల్లల ఎదుగుదలను మానిటర్ చేయాలని, సూపర్ వైజర్ ప్రతీ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. జిల్లాలో 6 నెలల నుంచి 5 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రూపొందించిన స్వస్థ్ బాలక్–హెల్తీ చైల్డ్ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని ఆదేశించారు. శ్యామ్ మామ్ పిల్లలను గుర్తించి వారికి పోషకాహారం అందించాలని సూచించారు. సొంత భవనాలు, తాగునిటీ సమస్య ఉన్న కేంద్రాల వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి, డీఆర్డీవో విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.