నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 29 2023 12:28 AM | Updated on Mar 29 2023 12:28 AM

- - Sakshi

.. ఆధారం తప్పనిసరి

ఆధార్‌ సవరణల్లో మోసాలను అరికట్టేందుకు యూఐడీఏఐ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను సమర్పించే పత్రాల్లో మార్పులు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

బుధవారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2023

8లోu

ఇఫ్తార్‌

6:28

సహర్‌

4:50

బుధ :

గురు

నిర్మల్‌:నిర్మల్‌ మున్సిపాలిటీలో నాలుగో తరగతి పోస్టుల ముచ్చట మరోసారి తెరపైకి వచ్చింది. ‘ముడుపుల’ వ్యవహారంపై మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లకు తెరతీసింది. తాజాగా ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించడంతో పంచాయితీ షురూ అయింది. కాంగ్రెస్‌ ఆందోళనలు, మహేశ్వర్‌రెడ్డి మంత్రిపై ఘాటుగా విమర్శలు చేయడంతో అధికార పార్టీ ప్రతిస్పందించింది. ఏకంగా ఆత్మీయ సమ్మేళనంలోనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మహేశ్వర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆరోపణలు కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. తాను ముడుపులు తీసుకున్నట్లు తేలితే చట్టప్రకారం ఏ శిక్షకై నా సిద్ధమని స్పష్టం చేశారు. మరోవైపు పట్టణ బీఆర్‌ఎస్‌ నేతలూ ప్రెస్‌మీట్‌ పెట్టి ఏలేటిపై మండిపడ్డారు.

కేసు నమోదుతో..

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ అంశంపై ఈనెల 21న ఏ లేటి మహేశ్వర్‌రెడ్డి స్పందించారు. అందులోనే ని ర్మల్‌ మున్సిపాలిటీలోనూ 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. మ ంత్రికి భూములు కబ్జా చేయడం, ఉద్యోగాలు అమ్ముకోవడం తప్ప నిరుద్యోగ సమస్యలు పట్టవని విమర్శించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మా రుగొండ రాము ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద మహేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా, ఏలేటి లేకపోవడంతో ఇంటి గోడకు అంటించారు.

ఆందోళనలు.. ఆరోపణలు..

మహేశ్వర్‌రెడ్డిపై కేసుల నమోదు, ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించడాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులు ఈనెల 27న జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేశారు. మహేశ్వర్‌రెడ్డి అంటేనే మంత్రి భయపడుతున్నారని, అందుకే తప్పు డు కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. దిలావర్‌పూర్‌లో మంత్రి దిష్టిబొమ్మనూ దహ నం చేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు చేశారంటూ పోలీ సులు మళ్లీ కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదు చేశారు.

ఐసీడీఎస్‌లో ‘పోస్టుకు ముడుపులపై’ విచారణ

భైంసాటౌన్‌: భైంసా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టు విషయమై అధికారులు మంగళవారం విచారణ చేపట్టా రు. విచారణ అఽధికారి శ్రీమతి మాట్లాడుతూ.. కలెక్టర్‌, డీడబ్ల్యూవో ఆదేశాల మేరకు ఆఫీస్‌ స బార్డినేట్‌ పోస్టు విషయంలో జరిగిన తంతుపై విచారణ జరిపినట్లు పేర్కొన్నారు. సీడీపీవో తోపాటు ముగ్గురు అంగన్‌వాడీ టీచర్లు, పోస్టు కు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు మహిళలను వి చారణ చేసినట్లు వివరించారు. విచారణ నివేదికను డీడబ్ల్యూవోకు అందిస్తామని తెలిపారు.

పండుగలు శాంతియతంగా జరుపుకోవాలి

భైంసాటౌన్‌:పట్టణ ప్రజలు పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. ఈనెల 30న భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర ఉన్నందున మంగళవారం ఆయన భైంసాను సందర్శించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎండీ జాబిర్‌ అహ్మద్‌, శోభాయాత్ర నిర్వాహకులతో కలిసి రూట్‌మ్యాప్‌ పరిశీలించారు. ఆయన వెంట సీఐ ఎల్‌.శ్రీను, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

న్యూస్‌రీల్‌

మంత్రిపై మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు

‘ఏలేటి’కి పోలీసుల నోటీసులు

నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళనలు

దమ్ముంటే నిరూపించాలన్న ‘అల్లోల’

అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ

లొల్లి పెట్టిన ‘ముడుపులు’

గతేడాది నిర్మల్‌ మున్సిపాలిటీని కుదిపేసిన నాలుగో తరగతి పోస్టుల ఎంపిక మరోసారి తెరపైకి వచ్చింది. 44 పోస్టుల నియామకాల్లో భా రీగా అవకతకలకు పాల్పడ్డారని, భారీ మొత్తం ముడుపులు తీసుకున్నారని, కుటుంబసభ్యులకే పోస్టులు ఇప్పించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్‌లు మున్సిప ల్‌ ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పలువురు అభ్యర్థులు కోర్టు వరకూ వెళ్లారు. మొదట మంత్రి, కలెక్టర్‌ ఆర్డీవో దా విచారణ కు ఆదేశించినా వివాదం ముదరడంతో అప్పటి కలెక్టర్‌ ముషరఫ్‌అలీ మొత్తానికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ముడుపుల విషయంలోనే మహేశ్వర్‌రెడ్డి మంత్రిపై ఆరోపణలు చేయడంతో మళ్లీ రచ్చ మొదలైంది. ఎన్నికల నేపథ్యంలోనే మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారు.

బహిరంగ చర్చకు సిద్ధమా...!

ఏఐసీసీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌: మున్సిపల్‌ పోస్టుల ముడుపుల విషయంలో ఏం జరిగిందో అందరికీ తె లుసని దీనిపై మంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా.. అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రతిసవాల్‌ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంగళవా రం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. అధి కారం ఉందని తనపై దొంగ కేసులు పెట్టించి నా, మున్సిపల్‌ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మ ల్‌ ప్రజలందరికీ తెలుసన్నారు. స్వయంగా అధి కారపార్టీ కౌన్సిలరే అవినీతి జరిగిందని చెప్పింది, ఆర్డీవో విచారణకు ఆదేశించింది నిజం కాదా అని ప్రశ్నించారు. గత కలెక్టర్‌ బదిలీపై వెళ్తూ నియామకాలు రద్దు చేయడం, అభ్యర్థులు కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్న విషయాలు వాస్తవం కాదా అని పేర్కొన్నారు. మున్సిపల్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను, వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఐదు పార్టీలు మారిన చరిత్ర నీది..

పార్టీలు మారే రాజకీయాలు తాను చేయలేదని, రెండుసార్లు ఓడిపోయినా, కష్టాలు ఎదురైనా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లోనే ఐదు పార్టీలు మారి, అవకాశవాద రాజకీయాలు చేసి న చరిత్ర ఇంద్రకరణ్‌రెడ్డిదే అని ఆరోపించారు. తాను పార్టీ మారాలనుకుంటే ఎవరూ అడ్డులేరని, కష్టమైనా నష్టమైనా కాంగ్రెస్‌ పార్టీలోనే తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నానని పేర్కొన్నారు.

ఆధారాలుంటే బయటపెట్టు

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌: మున్సిపల్‌ ఉద్యోగాల నియమాకాల్లో మహేశ్వర్‌రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సవాలు విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్నందుకే పో లీసులు ఆయనపై కేసు నమోదు చేశారని స్ప ష్టం చేశారు. మామడలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీరి యస్‌గా స్పందించారు. పోలీసులు ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారని, త నపై ఆరోపణలకు రుజువులు చూపాలని డి మాండ్‌ చేశారు. తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం ఎలాంటి శిక్షకై నా తను సిద్దమన్నారు.

రేపో.. మాపో పార్టీ మారుతడు..

కాంగ్రెస్‌ పార్టీలో మహేశ్వర్‌రెడ్డి పనైపోయిందని, రేపోమాపో ఆయన పార్టీ మారుడు ఖాయమని మంత్రి ఐకేరెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేస్తే స్పందించని మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులు కేసు నమోదు చేస్తే మాత్రం ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే మొదటి స్పందించింది బీఆర్‌ఎస్‌ పార్టీయే అన్నారు.

1
1/5

విచారణ చేపడుతున్న అధికారి శ్రీమతి2
2/5

విచారణ చేపడుతున్న అధికారి శ్రీమతి

రూట్‌మ్యాప్‌ పరిశీలిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌3
3/5

రూట్‌మ్యాప్‌ పరిశీలిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
4
4/5

సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
5
5/5

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement