
ఆరుగురు విద్యార్థులకు ముగ్గురు హాజరుకాగా, పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు
భైంసాటౌన్/భైంసారూరల్: అనగనగా ఓ ఊ రు.. ఆ ఊరిలో బడి.. బడిలో ఆరుగురు విద్యార్థులు. భైంసా మండలంలోని ఖత్‌గాం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేవలం ఆరుగురు విద్యార్థులే ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులుండగా, ఒకరు డిప్యూటేషన్‌పై ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో 20కిపైగా విద్యార్థులుండగా, కరోనా సమయంలో సంఖ్య 40 వరకు పెరిగింది. కానీ, తరువాత ఆ సంఖ్య ఆరుకి పడిపోయింది. భైంసా పట్టణం సమీపంలోనే ఉండడంతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడంతో ఈ పరిస్థి తి నెలకొందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రానురాను ఈ విద్యార్థులు కూడా లేకపోతే అనగనగా ఓ బడి అని చెప్పుకోవాల్సి వ స్తుంది. ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, ప్రజా ప్రతినిధులు దృష్టిసారించి విద్యార్థు ల సంఖ్య పెరిగేలా కృషి చేయాల్సిన అవసరముంది.