
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి
● మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ● కలెక్టరేట్‌లో రంజాన్ వేడుకలపై సమీక్ష
నిర్మల్‌చైన్‌గేట్: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఈమేరకు ప్రభుత్వం పరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలతో పాటు ఆయా గ్రామాల్లో మసీదులకు నిరంతరం తాగునీరు సరఫరా చేయాలని, కరెంటు కోతలు లేకుండా చూడాలని సూచించారు. మసీదుల వద్ద పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు ప్రతీరోజు చేపట్టాలన్నారు. నిర్మల్ పట్టణంలో కొత్తగా ఈద్గా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రంజాన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మైనార్టీలకు కానుకలు అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
అన్ని ఏర్పాట్లు చేశాం...
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మైనారిటీల షాపింగ్ కోసం ప్ర త్యేక సమయాలు కేటాయించామన్నారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుకార్లు నమ్మవద్దని, కొత్తవారు కనిపిస్తే సమాచా రం ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, రాజేందర్, జాబీర్ అహ్మద్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.