
దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
● డీసీసీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి ● మహేశ్వర్‌రెడ్డిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ● జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆదోళన
నిర్మల్‌చైన్‌గేట్/దిలావర్‌పూర్: ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు, ప్రజల తరఫున ప్రతిపక్షాలకు ఉంటుందని, దానిని కాలరాయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీసీసీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి, అక్రమాలను వెలికితీసి నిజా లను ప్రజలకు తెలియజేస్తున్న ఏఐసీసీ కార్యక్రమా ల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు పెట్టిన కేసులు ఎత్తివేయాలని డి మాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద, దిలావర్‌పూర్‌లో నిర్మల్–భైంసా రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు సోమవారం ఆందోళన చేశాయి. అనంతరం బీ ఆర్‌ఎస్ దిష్టిబొమ్మ, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ది ష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ము త్యంరెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్‌రెడ్డి అంటే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భయపడుతున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడేది లేదన్నారు. ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని హెచ్చరించారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను చులకనగా చేసి, పరీక్ష పేపర్ లీకులు కామాన్ అని మాట్లాడిన చరిత్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిదని, నిరుద్యోగులకు న్యాయం జరగాలని దీక్షలు చేసిన చరిత్ర ఏలేటిదని గుర్తుచేశారు. నిర్మల్ మున్సిపల్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలను జరిగడం, అవి నిరూపణ కావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రి స్వయంగా అక్రమాలు జరిగాయని మీడియా ముందు వచ్చి వివరాలు వెల్ల డించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మంత్రి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నాని ఆరోపించారు. మున్సి పల్ ఉద్యోగాల నియామకంలో తప్పులు జరగకపో తే నియామకాలు ఎందుకు రద్దు చేశారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాందేడపు చిన్ను ప్రశ్నించారు, బాధితుల తరఫున మహేశ్వర్‌రెడ్డి చేసిన దీక్షతో మంత్రి ప్రెస్‌మీట్‌లో నియామకాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు డీసీసీ అధ్యక్షుడు డి.ముత్యంరెడ్డి, జెడ్పీటీసి తక్కల రమణారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి దిలావర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరసనలో యూసుఫ్, సాయారెడ్డి, రాజ లింగం, ఉద్గిరి సాయినాథ్, దిలావర్‌పూర్ సర్పంచ్ జంగం వీరేశ్, రవి, సత్యనారాయణ్‌గౌడ్, ఉదయ్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, రమణ, నడ్పి ముత్యం, సంభు భోజా రాం పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులపై కేసు..
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిరసన తెలిపిన నిర్మల్ కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గంగాధర్ తెలిపారు. ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు అయినందున స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద అనుమతి లేకుండా కాంగ్రెస్ నాయకులు సోమవారం నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, నాయకులు జింక సూరి, కలీం, షేక్ జలాల్, చరణ్ సంతోష్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.