కాటేసిన పాముతో ఆసుపత్రికి చేరిన యువకుడు

Young Man Reaches Hospital With Snake Which He Bitten By - Sakshi

భువనేశ్వర్‌ : నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ సామాజిక ఆస్పత్రిలో ప్రజలు, డాక్టర్లు, రోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొందరైతే భయంతో పరుగులు తీశారు. అందుకు కారణం ఒక యువకుడు దాదాపు ఆరు అడుగుల నాగు పామును చేతిలో పట్టుకుని హాస్పిటల్‌కు రావడమే. ఆ యువకుడిని  చూసిన డాక్టర్లు, రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ యువకుడు నిర్భయంగా డాక్టర్‌ వద్దకు పాముతో వచ్చి ఈ పాము తనను కాటేసిందని, పాము కాటుకు మందు ఇవ్వండని కోరాడు. వివరాలిలా ఉన్నాయి. ఝోరిగాం యు.వి.51 (ఉమ్మరకోట్‌ విలేజ్‌ 51) ఛొటాగుడ గ్రామానికి చెందిన   సుధాంశు సీల్‌ (35) అనే యువకుడు బుధవారం పొలంలో పనిచేస్తున్నాడు,  ఆ సమయంలో ఓ పాము సుధాంశును కాటేసింది.

అయితే పాము కాటుకు చలించని సుధాంశు నిర్భయంగా ఒక చేతితో పాము తల పట్టుకుని మోటారు బైక్‌పై ఉమ్మరకోట్‌ సామాజిక హాస్పిటల్‌కు చేరుకున్నాడు. చేతిలో పాముతో వచ్చిన సుధాంశును చూసిన వారంతా భయంతో వణికిపోయారు. దీంతో సుధాంశు పామును ఒక సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టి చికిత్స కోసం డాక్టర్‌ను ఆశ్రయించాడు. బాధితుడికి డాక్టర్‌ ప్రాథమిక చికిత్స చేశారు. నాగు పాము కాటు వేసినా సుధాంశు చలించక పోవడం, కాటు వేసి కొన్ని గంటలైనా ఏమీకాక పోవడంతో డాక్టర్లు సైతం ఆశ్యర్య పోయి హాస్పిటల్‌లో చేర్చి పర్యవేక్షిస్తున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top