మిమ్మల్ని ఉరితీస్తా,ఉద్యోగులకు కలెక్టర్‌ వార్నింగ్‌

Will Hang You Gwalior District Collector Kaushlendra Vikram Singh Warning To Staff - Sakshi

ఓ జిల్లా కలెక్టర్‌ తన నోటికి పనిచెప్పారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శిస్తే ఉరితీస్తామని బహిరంగంగా వార్నింగ్‌ ఇచ్చారు.

భారత్‌లో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి దేశంలో మొత్తం 68 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో ఉద్యోగులు అనుకున్నంత స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విఫలమయ్యారు. ఈ సందర్భంగా గ్వాలియర్‌ జిల్లా కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌ సింగ్‌ భితర్వార్‌ రెవెన్యూ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ కౌశలేంద్ర ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకూడదు. అలా చేస్తే మిమ్మల్ని ఉరితీస్తా. వ్యాక్సిన్‌ వేయించుకునేలా ప్రజలతో మాట్లాడండి. వ్యవసాయ క్షేత్రాల్లో తిరగండి. బ్రతిమలాడండి. వ్యాక్సినేషన్‌ మాత్రం పూర్తిగా జరిగేలా చూడండి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.  

ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. వైరలతున్న వీడియోలపై కలెక్టర్‌ కౌశలేంద్ర స్పందించారు. ఉద్యోగుల గురించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వ్యాక్సినేషన్‌ టార్గెట్‌ కంప్లీట్‌ చేయకపోవే సస్పెండ్‌ చేస్తానని మాత్రమే తాను హెచ్చరించినట్లు వెల్లడించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top