బీజేపీ నాయకుడి ఇంటిపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు

Terrorists Attack BJP Leader Anwar Khan Residence in Jammu and Kashmir - Sakshi

జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకున్న ఘటన

ఓ సెంట్రీ మృతి.. బీజేపీ నాయకుడు క్షేమం

కశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. బీజేపీ నాయకుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ నౌగామ్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగర శివార్లలోని నౌగామ్‌, అరిగం ప్రాంతంలోని బీజేపీ నాయకుడు అన్వర్‌ ఖాన్‌ ఇంటి బయట గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఓ సెంట్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు అక్కడి నుంచి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌తో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సెంట్రీని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు హస్పిటల్‌ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నజీర్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా, పార్టీ కశ్మీర్ యూనిట్ ఈ దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి మంజూర్ భట్ తెలిపారు.

చదవండి: రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top