Tamil Nadu Electricity Tariff: తమిళనాడులో ఇకపై ఏటా పవర్‌ షాక్‌!

Tamil Nadu: Electricity Tariff Hike 6pc July Hikes Every Year - Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగ దారులకు ఇకపై ఏటా వడ్డన తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి జూలై నెలలో 6శాతం మేరకు విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించిన ఓ నివేదిక విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు మంగళవారం బోర్డు అందజేశాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్‌ వాడకం పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో ఒకసారి విద్యుత్‌ చార్జీలను పెంచారు. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి చార్జీలు విధించలేదు.

ఫలితంగా కాల క్రమేనా విద్యుత్‌ బోర్డుకు కష్టాలు పెరిగాయి. అప్పులు అమాంతంగా పెరిగాయి. అయినా, గత పాలకులు విద్యుత్‌ చార్జీల పెంపుపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. దీంతో చార్జీల వడ్డనకు విద్యుత్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చే ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేవిధంగా గత నెల  విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ పెంపు ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు సైతం సాగుతున్నాయి. దీంతో ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలో విద్యుత్‌ బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ బోర్డు వినియోగదారుల నెత్తి మరోబాంబును పేలి్చంది.

పెంపునకు ప్రణాళిక..
ప్రస్తుతం ఉన్న అప్పులు, మున్ముందు ఎదురయ్యే నష్టాలు, కష్టాలను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్‌ బోర్డు ముందస్తు ప్రణాళిక సిద్ధ్దం చేసింది. భారం మరింత బరువెక్కకుండా ఏటా చార్జీల వడ్డనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందుకు తగ్గ నివేదికను రూపొందించి, ఆమోదం కోసం విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు పంపించింది. తొలివిడతగా.. ఏటా 6 శాతం పెరుగుదలతో నాలుగేళ్లపాటు దీన్ని కొనసాగించాలని అందులో సిఫార్సు చేసింది.

చదవండి: శ్రావణమాసం ఎఫెక్ట్‌.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top