
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం.. జైపూర్‌లోని జామ్వా రామ్‌గఢ్ ప్రాంతంలో ఉన్న టర్పెంటైన్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Rajasthan | Three children and a man died after a fire broke out at a Turpentine oil factory in Jamwa Ramgarh, Jaipur. The fire was brought under control: CO Shiv Kumar pic.twitter.com/NEfnCgHFzM
— ANI (@ANI) January 30, 2022
చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ