Rahul Gandhi: రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియో.. జరిగింది ఇది..

Rahul Gandhi Nepal Bar Issue Here Is The Fact Details - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్‌ వీడియో ఇంటర్నెట్‌లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నైట్‌పార్టీకి హాజరైన ఈ వీడియో ఆధారంగా బీజేపీ నేతలు రాహుల్‌ను టార్గెట్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ డిఫెన్స్‌లో పడిపోయింది. అయితే, ఈ వీడియోపై ఓ జాతీయ మీడియా సంస్థ అసలు నిజాలు తెలుసుకొని వీడియోతో సహా రాహుల్‌ పక్కనే ఓ యువతి గురించి క్లారిటీ ఇచ్చింది. 

నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ కనిపించారు. వీడియోలో రాహుల్‌ ఓ యువతి మాట్లాడటం కనిపించింది. సదరు యువతి నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్‌ ప్రధానిపైనా హనీ ట్రాప్‌ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. కానీ, తాజాగా ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ఆమె చైనీస్‌ కాదని తెలిపింది. ఆమె నేపాలీ మహిళ, వధువు స్నేహితురాలు రాబిన్‌ శ్రేష్ట అని పేర్కొంది. అయితే, సుమ్నిమా ఉదాస్ వివాహం కోసం రాహుల్‌ సోమవారం నేపాల్‌కు వెళ్లారు. 

 ఆమె గురించి వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌కు దిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాలపై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ గ్యాంగ్‌రేప్‌ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్‌ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలను రాశారు. 2001 నుంచి 2017వరకు సీఎన్‌ఎన్‌లో పనిచేసిన సుమ్నిమా.. 2018 నుంచి లుంబినీ మ్యూజియం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, ఫౌండర్‌గా కొనసాగుతున్నారు. 

సుమ్నిమా ఉదాస్ ‍ఫొటోలు

ఇది కూడా చదవండి: ముగిసిన డెడ్‌లైన్‌.. ముంబైలో హైఅలర్ట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top