కే విశ్వనాథ్‌గారు ఎంతో ప్రత్యేకం.. ప్రధాని మోదీ ట్వీట్‌

PM Modi Condoles Legendary Director Kalatapasvi K Viswanath - Sakshi

దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ కన్నుమూతపై తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఆయనకు అనుబంధం ఉన్న ఇతర భాషల ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. 

కే విశ్వనాథ్‌గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినీ ప్రపంచంలో ఓ ప్రముఖుడు. తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న వ్యక్తి. వివిధ శైలిలో తెరకెక్కిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

విశ్వనాథ్‌ తన చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సైతం పొందారు. కమర్షియల్‌ సినిమాకు.. ఆర్ట్‌ను జోడించడం, తన చిత్రాల్లో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఆయన శైలి. కులవర్ణ లింగ వివక్ష, స్త్రీ ద్వేషం, మద్య వ్యసనం.. ఇలా సామాజిక-ఆర్థిక మేళవింపుగా ఉండేవి ఆయన చిత్రాలు.   తెలుగులోనే కాకుండా హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన తొమ్మిది చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక నటుడిగానూ తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో అలరించారాయన. నటుడిగా ఆయన చివరి చిత్రం(కన్నడ) ఒప్పంద(2022).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top