జీడీపీ తగ్గుదల.. కేంద్రంపై ఆగని విమర్శలు

P Chidambaram Shares Modi 2013 Tweet - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం గతంలో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ని గుర్తు‌ చేశారు. ఇందుకు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసి.. విమర్శలు గుప్పించారు. 2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని కోరుతూ మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు. దానినే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శలు గుప్పించారు.(చదవండి: ఆ ఆర్మీ శునకాలను పొగిడిన మోదీ)

కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top