మన్మోహన్‌ సింగ్‌ పుట్టిన రోజు.. రాహుల్‌ శుభాకాంక్షలు

As Manmohan Singh Turns 88 PM Modi Wishes Him - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పుట్టిన రోజు నేడు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా మాజీ ప్రధానికికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం లభించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

మీ వంటి వ్యక్తి ప్రధానిగా లేకపోవడంతో భారతదేశం లోటుగా భావిస్తోంది. ఆయన నిజాయతీ, మర్యాద, అంకితభావం మనందరికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top