మోకాలిని చితక్కొట్టిన ఖాకీలు | Mandya Police Beat Man Brutally During Ugadi Festivities And Family Demands Action, More Details Inside | Sakshi
Sakshi News home page

మోకాలిని చితక్కొట్టిన ఖాకీలు

Mar 24 2026 10:57 AM | Updated on Mar 24 2026 11:31 AM

mandya police brutality complaint si rasool case

కర్ణాటక: ఉగాది పండుగ రోజున ఇస్పేటు ఆడుతున్న వందలాది మందిపై పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తి మోకాలు ముక్కలయ్యేలా కొట్టారు, దీంతో బాధితుని కుటుంబం, గ్రామస్తులు పోలీసులపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. మండ్య తాలూకాలోని కాలెనహళ్లి గ్రామానికి చెందిన కేసీ గిరీష్‌ బాధితుడు, 19వ తేదీ సాయంత్రం మండ్య రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రసూల్‌సాబ్‌ గౌండి, సిబ్బంది ధనంజ, ప్రకాష్‌" కుమార్‌ దాడి చేసి లాఠీతో అతని మోకాలి చిప్పను పగలగొట్టారు.

 ఇస్పేటు ఆడుతున్న జనాలపైకి యూనిఫామ్‌లు ధరించకుండా ప్రైవేట్‌ వాహనంలో వచ్చిన పోలీసులు దాడిచేసి ఇష్టానుసారం చితకబాదారు. గిరీష్‌ మోకాలి చిప్ప పగిలిపోయిందని, మైసూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి్పంచామని అతని కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. ఎస్‌ఐ రసూల్, ఇతర పోలీసులను సస్పెండ్‌ చేసి కేసు పెట్టాలి, తమకు వైద్యఖర్చులను అందజేయాలని మండ్య రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.     

Advertisement
 
Advertisement
Advertisement