వైరల్: అతడు..ఆమె.. ఓ పానీపూరీ ప్రేమ కథ

Man Hides Ring Inside Panipuri Propose To Girlfriend Viral - Sakshi

లవ్‌ అట్‌ ఫస్ట్‌ సైట్‌లో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంటారు. కానీ అదే ప్రేమను తెలపాలంటే చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రేమను మనం ఇష్టపడే వారికి తెలియపరచడం అనేది ఓ మధురానుభూతి. అందుకే ప్రేమించడం సులువు గానీ అది వ్యక్తపరచడం చాలా కష్టమని అంటుంటారు. ఇలా ఇష్టపడే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం కోసం అబ్బాయిలు చాలానే ఆలోచిస్తుంటారు.

అలా ఓ ప్రేమికుడు తను ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను తెలపాలనుకున్నాడు. దాని కోసం ఎంతో ఆలోచించి ఓ క్రేజీ ఐడియాతో తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంకేముంది కొత్తదనం ఉంటే చాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొట్టేస్తుందన్న విషయం తెలిసిందే. 

ఆ ప్రేమికుడు తన ప్రేయసిని.. అలా పానిపూరి దుకాణంలో తీసుకెళ్లాడు. ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా ఆకస్మాత్తుగా అతనికి ఓ ఐడియా మదిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా..  ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేసేశాడు. ఇక ఈ వెరైటీ ప్రపోజల్‌కు అమ్మాయితో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారండోయ్‌. మామూలుగానే  పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు.  దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్‌చల్‌ చేస్తోంది.

చదవండి: Fact Check: వ్యాక్సిన్‌ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top