సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు, ఆన్‌లైన్ రైలు టిక్కెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయని, మొత్తం రిజర్వ్డ్ బుకింగ్‌లలో 88 శాతం, అంటే 48.25 కోట్లకు పైగా టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అయ్యాయని ప్రభుత్వం బుధవారం తెలిపింది.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌ల వైపు మొగ్గు పెరుగుతోందన్నారు. తద్వారా రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు, ప్రయాణ సమయం, ఖర్చులను ఆదా చేయడం ద్వారా ప్రయాణికులకు టిక్కెటింగ్ సులభతరం మైందన్నారు.
ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వేల అత్యంత ప్రయాణీకుల స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ కోసం ఐఆర్‌సీటీసీ గణనీయమైన ఖర్చు చేస్తోందనీ, టిక్కెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉన్నతీకరణ విస్తరణకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి, ఐఆర్‌సిటిసి చాలా నామ మాత్రపు రుసుమును వసూలు చేస్తుందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం అత్యధిక టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అవుతుండటంతో, ఆన్‌లైన్ వ్యవస్థ భారతీయ రైల్వే చేపట్టిన అత్యంత ప్రయాణీకుల-స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా మారిందని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి,దుర్వినియోగాన్ని నివారించడానికి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
3 करोड़ से ज्यादा फेक अकाउंट IRCTC से हटाए गए हैं। आज जेनुइन पैसेंजर्स को कंफर्म टिकट मिलने लगा है: माननीय रेल मंत्री @AshwiniVaishnaw जी pic.twitter.com/FhaP5rAwGm
— Ministry of Railways (@RailMinIndia) March 25, 2026
> ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మంత్రి వివరణలోని మరికొన్ని విశేషాలు
ఆధార్ ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలరు.గత ఏడాదిల జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నకిలీ ఖాతాల వాడకాన్ని పరిమితం చేయడానికి,నిజమైన ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడింది.
2025 సంవత్సరంలో, 3.04 కోట్ల వినియోగదారుల ఖాతాలులను రద్దు చేయగా, 2.94 కోట్ల వినియోగదారుల ఖాతాలు పునఃధృవీకరణ ఎంపికతో తాత్కాలికంగా నిలిపివేశారు. (టెలిగ్రామ్‌లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్ చేస్తే!)
అయితే గత ఏడాది జనవరి నుంచి ఈ ఫిబ్రవరి 28 మధ్య కాలంలో, 1,80,474 వినియోగదారుల ఖాతాలు తిరిగి యాక్టివ్ చేశారు.
సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి ఐఆర్‌సీటీసీ తన సాంకేతిక వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. దీని యాంటీ-బాట్ టెక్నాలజీ సుమారు 64 శాతం హానికరమైన ట్రాఫిక్‌ను నిరోధించగలదు, తద్వారా నిజమైన వినియోగదారులకు బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి 28, 2026 నాటికి 13,023 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లు అరికట్టామని వైష్ణవ్ వివరించారు. సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా బుకింగ్ సరళిని ,వినియోగదారుల రిజిస్ట్రేషన్‌లను పరిశీలించి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తుల కూడా కొనసాగుతుందన్నారు.


