Heavy Rains in Chennai:Tamil Nadu Chief Minister MK Stalin Visited Various Rain Affected Places - Sakshi
Sakshi News home page

Heavy Rains: చెన్నైలో రెడ్‌ అలెర్ట్‌.. 48 గంటల్లో అతి భారీ వర్షాలు

Nov 7 2021 3:15 PM | Updated on Nov 7 2021 3:47 PM

Heavy Rains Lashed Chennai CM Stalin Review On Rains - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కుండపోత వర్షం​ కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. టీ. నగర్‌, గిండీ, సైదాపేట, వేలచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అదేవిధంగా కన్యాకుమారి, కాంచీపురం, మధురైలో జోరువాన కురుస్తోంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. 2015 తర్వాత తొలిసారి ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement