మాజీ సీఎంకు కరోనా పాజిటివ్ | Former Karnataka CM Siddaramaiah tests positive for coronavirus | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

Aug 4 2020 8:49 AM | Updated on Aug 4 2020 9:05 AM

 Former Karnataka CM Siddaramaiah tests positive for coronavirus - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, బెంగళూరు : కరోనా మహమ్మారి కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కరోనా బారిన పడగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్షనేత మాజీ సీఎం సిద్ధరామయ్య (71) కు  కరోనా సోకింది. ఈ విషయం సిద్ధరామయ్య ట్విటర్ ద్వారా వెల్లడించారు.  

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలున్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్‌ చేశారు.  సిద్దరామయ్య ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో సీఎం యడ్యూరప్ప కూడా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement