ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే

Every House Owned By A Woman In Maharashtra Village - Sakshi

Not A Single House In The Village Is Owned By A Man: మహిళా సాధికారత అంటూ ఏవేవో పెద్ద మాటలు చెబుతారు. కానీ నిజానికి వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. ఇంకా చాలా విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు దక్కడం లేదనే చెప్పాలి. కానీ ఇక్కడొక ఊరు మాత్రం లింగ సమానత్వాన్ని పాటిస్తూ ఆదర్శ గ్రామంగా నిలిచింది.

వివరాల్లోకెళ్తే...మహారాష్ట్రాలోని జౌరంగాబాద్‌ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బాకాపూర్‌లోని ప్రతి ఇంటి నేమ్‌ ప్లేట్‌ పై మహిళ పేరే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఇంటికి మహిళలే యజమానులు. బకాపూర్‌లో దాదాపు 2 వేల నివాసితులతో కూడిన చిన్న గ్రామం. అయితే అక్కడ ప్రతి ఇంటికి మహిళే హక్కుదారిగా ప్రకటించి లింగ సమానత్వానికి పెద్ద పీట వేసిందంటూ అధికారులు ఆ గ్రామం పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అక్కడ పంచాయతీ రికార్డుల్లో కూడా  యజమానిగా మహిళ పేరే ఉంటుంది. 2008లో గ్రామ పంచాయతీ చేసిన ప్రత్యేక ప్రతిపత్తితోనే ఇది సాధ్యమైంది. ఈ మేరకు బాకాపూర్ సర్పంచ్ (గ్రామాధికారి) కవితా సాల్వే మాట్లాడుతూ..."ఈవిధంగా చేయడం వల్లే ఇంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలను మహిళలే తీసుకుంటున్నారని గర్వంగా చెబుతున్నారు. అయితే ప్రతి ఇంటికి మహిళలనే యజమాని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సుదాంరావు పలాస్కర్‌ ఉన్నారు.

పురుషులు తమ కుటుంబాల అనుమతి లేకుండా ఇళ్లను అమ్ముకోవచ్చనే భయం ఇక్కడ ఉండేది. దీని వల్ల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయి. కానీ, మహిళను ఇంటి యజమానిగా చేయాలనే నిర్ణయం ఇక్కడి మహిళలకు అధికారం, భద్రత కల్పించింది. ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో వారే కీలకపాత్ర పోషిస్తున్నారు. అని అన్నారు. మాజీ సర్పంచ్‌ పలాస్కర్‌ మాట్లాడుతూ..గతంలో జరిగిన కొన్ని అనుభవాల ఆధారంగా, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఆమె నివాసానికి యజమానిగా చేయాలని నిర్ణయించారు.

ఆ సమయంలో గ్రామ పంచాయతీలో మాకు ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఒక్క సభ్యుడు కూడా ఓటు వేయలేదు. ఈ నిర్ణయం ఒక అర్ధాన్ని తెచ్చిపెట్టింది. ప్రతి గ్రామంలోని ఇంటిలో మహిళల భద్రత, పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం ”పలాస్కర్ అన్నారు. ఒక వ్యక్తి బకాపూర్‌లో ఇల్లు కొనాలనుకున్నా, అతను దానిని తన కుటుంబంలోని ఒక మహిళతో కలిసి కొనుగోలు చేయాలి అని ఉప సర్పంచ్ అజీజ్ షా అన్నారు.

(చదవండి:  రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top