కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం

Dr Reddy launches OVID-19 drug Remdesivir in India - Sakshi

రెమ్‌డెసివిర్‌  డ్రగ్ రెడిక్స్ లాంచ్

సాక్షి,  హైదరాబాద్ : కరోనా నివారణకు సంబంధించి దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ రెమ్‌డెసివిర్‌  కొత్త ఔషధాన్ని లాంచ్ చేసింది. కోవిడ్ -19 రోగుల చికిత్సకు  గాను భారతదేశంలో 'రెడిక్స్' బ్రాండ్ పేరుతో అందుబాటులోకి  తీసుకొచ్చినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 100 మి.గ్రా  పరిమాణంలో రెడిక్స్ మందును లాంచ్ చేసినట్టు పేర్కొంది.  (ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన)

కరోనా రోగుల అవసరాలను తీర్చగల ఉత్పత్తుల అభివృద్ధిలో తమ  ప్రయత్నాలను కొనసాగిస్తామని  కంపెనీ బ్రాండెడ్ మార్కెట్స్ (ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్)  సీఈఓ ఎంవీ రమణ చెప్పారు. రోగులకు క్లిష్టమైన  ఔషధం రెడిక్స్ ను తీసుకురావడం తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. రెమ్‌డెసివిర్‌  సంస్థ  గిలియడ్ సైన్సెస్ తో డా. రెడ్డీస్ చేసుకున్న లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం భారత్‌తో సహా 127 దేశాలు ఈ  డ్రగ్ తయారీకి, విక్రయాలకు అనుమతి ఉంది. తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల చికిత్స కోసం భారతదేశంలో పరిమిత అత్యవసర ఉపయోగం కోసం రెమ్‌డెసివిర్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top