Delhi: Thunderstorm Heavy Rain Nearby Areas Details In Telugu - Sakshi
Sakshi News home page

ఉరుములు, మెరుపులతో ఢిల్లీలో భారీ వర్షం

Jan 8 2022 11:39 AM | Updated on Jan 8 2022 12:46 PM

Delhi: Thunderstorm Heavy Rain Delhi Nearby Areas - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ, నేషనల్ కాపిటల్ ప్రాంతం‌ (గురుగ్రామ్, ఫరీదాబాద్, మనేసర్, బల్లభ్‌గఢ్) కర్నాల్, పానిపట్, గన్నౌర్, సోనిపట్, ఖర్ఖోడా, ఝజ్జర్, సోహనా, పాల్వాల్, నూహ్ (హర్యానా) ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం శనివారం ఉదయం వరకు కురిసింది.

ఢిల్లీలో పాటు బాగ్‌పత్ (ఉత్తరప్రదేశ్‌), తిజారా (రాజస్థాన్) వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ ట్విటర్‌లో పేర్కొంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement