30 ఏళ్ల జడ్జి.. భార్యతో గొడవపడి బలవన్మరణం? | Delhi judicial officer dead at home | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల జడ్జి.. భార్యతో గొడవపడి బలవన్మరణం?

May 2 2026 9:46 PM | Updated on May 2 2026 9:50 PM

Delhi  judicial officer dead at home

ఢిల్లీ: ‘నాన్నా బ్రతకడం కష్టంగా ఉంది.  నేను ఇబ్బందుల్లో ఉన్నాను’ అని తండ్రికి ఫోన్‌ చేసిన  ఓ  30 ఏళ్ల జ్యుడిషియల్‌ ఆఫీసర్‌.. ఆ మరుసటి రోజే శవమై పోయాడు.  ఎంతటి కష్టమొచ్చిందో తెలియదు కానీ తన ఇబ్బందిని పూర్తిగా తండ్రికీ చెప్పుకోలేక, ఇటు భార్యతోనూ పూర్తిగా ఇమడలేక తనువు చాలించాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుందని తండ్రితో అన్నాడే కానీ, విషయం మాత్రం చెప్పలేదు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ న్యాయాధికారి  దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన అనుమానిత ఆత్మహత్య క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

వివరాల్లోకి వెళితే.. అమాన్‌ శర్మ.. ఉత్తర ఢిల్లీలోని కర్కర్దూమాలో డీఎల్‌ఎస్‌ఏ(డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ) సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ అధికారి కాస్తా  తన గ్రీన్ పార్క్ ఇంట్లో విగతజీవిగా మారిపోయాడు.  తన బావ అమాన్‌ శర్మ.. బాత్రూమ్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని బావమరిది పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. 

చనిపోయే ముందు భార్యతో గొడవ.. కన్నీళ్లు
అతను చనిపోయే ముందు భార్యతో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం..  అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో గొడవ పడి విపరీతంగా ఏడ్చేశాడని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఇద్దరు విపరీతంగా అరుచుకున్నారన్నారు. 

నాకు ఫోన్‌ చేసి ఇబ్బంది ఉందన్నాడు..
తన కొడుకు చనిపోవడానికి ముందు రాత్రి ఫోన్‌ చేసి మాట్లాడాడని, తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ద్వారా తెలిసింది. ‘ నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. “నాకు జీవించడం కష్టంగా మారింది’ అని తండ్రి స్సష్టం చేశారు. 

అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు
ఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది,  మేము వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడతున్నాడు.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గుర్తించలేదు, అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement