విజయ్‌ వీరాభిమానుల ఆత్మహత్యాయత్నం | Delay In TVK Vijay Government Formation In Tamil Nadu, Fans Attempts To End Their Lives, More Details Inside | Sakshi
Sakshi News home page

విజయ్‌ వీరాభిమానుల ఆత్మహత్యాయత్నం

May 9 2026 4:11 PM | Updated on May 9 2026 4:59 PM

Delay in Vijays Government Formation Fan Attempts To End Their Life

చెన్నై:  తమిళనాడులో విజయ్‌ టీవీకే వందకు పైగా స్థానాలు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉండటంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. తమ నాయకుడు విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

విజయ్‌ సీఎం కావడంపై ఇంకా అనిశ్చిత నెలకొన్న సందర్భంలో ఇద్దరు టీవీకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో నిన్న ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయగా, నేడు(శనివారం, మే 9వ తేదీ) ఇసక్కియప్పన్ అనే పార్టీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉండటం, విజయ్‌ సీఎం కాలేడేమోనని మనస్తాపానికి గురై తిరునెల్వేలిలో ఇసక్కియప్పన్ ఆత్మాహుతికి ప్రయత్నించాడు.  ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇసక్కియప్పన్ 4 నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలంటూ తన చెంపలను ఇనుప చువ్వతో పొడుచుకున్నాడు. 

ఇదిలా ఉంచితే. నిన్న(శుక్రవారం, మే 8వ తేదీ) టీవీకే చెందిన వీరాభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై స్నేహితులతో వాగ్వాదం అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు 42 ఏళ్ల పార్టీ కార్యకర్త. ప్రస్తుతం చెన్నైలోని రాజీవ్‌ గాంధీ జనరల్‌ ఆసుపత్రి(ఆర్జీజీజీహెచ్‌)ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు సదరు అభిమానుం.  ఈ ఘటన తాంబరం సమీపంలోని సెలైర్-సెంబక్కం ప్రాంతంలో జరిగింది. మృతుడిని మారిముత్తుగా గుర్తించారు, అతను మేస్త్రీగా పనిచేస్తాడని, విజయ్‌కు వీరాభిమాని అని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement